: స్వింగ్ తో కొట్టాను: బిన్నీ


బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో సంచలన స్పెల్ (4.4-2-4-6) తో పతాక శీర్షికలకెక్కిన టీమిండియా పేసర్ స్టూవర్ట్ బిన్నీ స్వింగే తన ప్రధాన ఆయుధం అంటున్నాడు. మిర్పూర్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం బిన్నీ మీడియాతో మాట్లాడాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం, స్వింగ్ చేయడం తన ప్రధాన బలమని చెప్పుకొచ్చాడు. పిచ్ పరిస్థితులు కూడా తన బౌలింగ్ శైలికి అతికినట్టు సరిపోయాయని తెలిపాడు.

మ్యాచ్ ఓడిపోతామని ఏ దశలోనూ భావించలేదని చెప్పాడు. బ్యాటింగ్ ప్రదర్శన పట్ల అసంతృప్తికి లోనయ్యామని ఈ కర్ణాటక ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. భాగస్వామ్యాలను విడదీయగలిగితే విజయం వరిస్తుందని తాము మొదటి నుంచి ధీమాగానే ఉన్నామని చెప్పాడు. మిడిల్ స్టంప్ పై బంతులేసి స్వింగ్ చేయడం సత్ఫలితాలను ఇచ్చిందని బిన్నీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News