: నెస్ వాడియా తండ్రికి అండర్ వరల్డ్ డాన్ బెదిరింపులు: ముంబై పోలీస్
ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా తండ్రి నస్లీ వాడియాని అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి బెదిరించినట్టు ఫిర్యాదు అందిందని ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ మహేష్ పటేల్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, నెస్ వాడియా కుటుంబానికి రవి పూజారా నుంచి బెదిరింపు మెసేజ్ వెళ్లిందని అన్నారు. అయితే నస్లీ వాడియా ఫోన్ కు రవి పూజారా మెసేజ్ పంపాడా? లేక అతని కార్యదర్శికి మెసేజ్ పంపాడా? అనే విషయాన్ని ఆయన ధృవీకరించలేదు.
అలాగే నస్లీ వాడియా కార్యదర్శి పేరు కూడా వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ బెదిరింపులు ప్రీతి జింటా కేసు నేపథ్యంలో వచ్చాయా? లేక మరేదైనా విషయంలో వచ్చాయా? అనేది నిర్థారించేందుకు నెస్ వాడియా కుటుంబంలోని వ్యక్తులు మీడియాకు అందుబాటులో లేరు.