: బియాస్ నదిలో గాలింపు చర్యలను తగ్గించారు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలను తగ్గించారు. విహార యాత్రకు వెళ్లిన తెలుగు విద్యార్థుల్లో 24 మంది ఈ నెల 8వ తేదీన గల్లంతైన విషయం విదితమే. వారిలో ఇప్పటివరకు 8 మృత దేహాలు మాత్రమే లభ్యమవ్వగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఇవాళ గాలింపు చర్యల్లో సహాయక సిబ్బందిని సగానికి పైగా తగ్గించారు. 250 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎన్ ఎస్ బీ, ఐటీబీపీ సిబ్బంది వెనుదిరిగారు.