: ప్రీతి జింటా కేసులో మాఫియా దూరింది...కేసు మరో మలుపు
ప్రముఖ బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా, వ్యాపారవేత్త, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహయజమాని నెస్ వాడియా మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రీతి జింటాను లైంగికంగా నెస్ వాడియా వేధించినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. వాటిని ప్రీతి జింటా తరపు న్యాయవాది ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్ వాడియా దుర్భాషలాడి తనను అవమానపరిచాడని ప్రీతి జింటా పెట్టిన కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, నెస్ వాడియా కుటుంబం పోలీసులకు ఇంకో ఫిర్యాదు చేసింది. మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది.