: మంత్రిగా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తా: పరిటాల సునీత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని పరిటాల సునీత చెప్పారు. ఇవాళ ఉదయం మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ... పేదలకు అన్నం పెట్టే కీలక శాఖ అప్పగించి తనకు సముచిత స్థానం కల్పించారన్నారు. పరిటాల రవి మరణం తర్వాత పడరాని కష్టాలు పడ్డానని ఆమె చెప్పారు. అయితే, కష్ట సమయంలో పార్టీ తనకు అండగా నిలిచిందని పరిటాల సునీత అన్నారు.

  • Loading...

More Telugu News