: వలస వస్తుంటే పడవ మునక....66 మంది గల్లంతు
మలేసియాలో దారుణం చోటుచేసుకుంది. ఇండోనేసియా నుంచి వలస వస్తున్న ప్రయాణికులతో నిండిన పడవ మలేసియా పశ్చిమ కోస్తా తీరంలో మునిగిపోయింది. పడవలో 97 మంది ఇండోనేసియా దేశీయులు ఉండగా, 66 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత సమాచారం అందుకున్న అధికారులు 31 మందిని కాపాడారు. కాగా, పడవ సామర్థ్యానికి మించి ప్రయాణించడమే మునకకు కారణమని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం హెలీకాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.