: టికెట్ రేటు తగ్గించిన ఇండిగో, స్పైస్ జెట్
దేశంలో చవకైన విమానయానానికి స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు పెట్టింది పేరు. తాజాగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ రెండు సంస్థలు మరోసారి భారీస్థాయిలో టికెట్ల ధరలను తగ్గించాయి. స్పైస్ జెట్ రూ.1999తో ప్రారంభ టికెట్ ధరను ప్రకటించగా, ఇండిగో రూ. 1724 (ఢిల్లీ-లక్నో)తో టికెట్ రేటు ప్రకటించి తానూ తక్కువ తినలేదని చాటింది. స్పైస్ జెట్ ధరలు జూలై 19 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ప్రయాణించేవారికే వర్తిస్తాయి. అయితే, తగ్గింపు ధరలతో స్పైస్ జెట్ టికెట్లు పొందాలంటే నేటి నుంచి గురువారంలోపే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇండిగో టికెట్లు కూడా ఇదే కాలవ్యవధిలో కొనుగోలు చేస్తేనే తగ్గింపు అందుబాటులోకి వస్తుంది.