: ఆసీస్ జట్టుకు లంకేయుడి సేవలు


ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సేవలందించనున్నాడు. ఆసీస్ జట్టు యూఏఈలో పాకిస్తాన్ తో మరికొద్ది రోజుల్లో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో మురళీ ఆసీస్ జట్టు సహాయక బృందంతో జతకలవనున్నాడు. ఈ విషయాన్ని మురళీనే స్వయంగా వెల్లడించాడు. అజ్మల్, హఫీజ్ లాంటి ప్రమాదకర పాక్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకే కంగారూలు లంక ఆఫ్ స్పిన్ లెజెండ్ ను స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఏరికోరి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News