: చాలెంజర్స్ ప్రతీకారమా.. సన్ రైజర్స్ కు మరో విజయమా!?
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మరోసారి తలపడనున్నాయి. అయితే ఈసారి వేదిక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. ఇంతకుముందు ఈ రెండు జట్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన పోరులో సన్ రైజర్స్ నే విజయలక్ష్మి వరించింది. ఆ మ్యాచ్ లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చాలెంజర్స్ భావిస్తున్నారు. అందుకు సొంతగడ్డపై జరగబోయే నేటి మ్యాచ్ సువర్ణావకాశం. కాగా, ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మరికాసేట్లో మ్యాచ్ ఆరంభం కానుంది.