: భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ అంతర్భాగమైంది: ముఖేష్ అంబానీ


దేశ ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ అంతర్భాగమైందని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ముంబాయిలో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ... విద్యుత్ రంగంలో పెట్టుబడులతో దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 14.7 శాతమని ఆయన చెప్పారు. గతేడాది 68 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేశామని ఆయన అన్నారు. ప్రైవేటు రంగంలో అత్యధికంగా పన్ను చెల్లించేది రిలయన్స్ సంస్థేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మొత్తం పరోక్ష పన్నుల్లో 4.7 శాతం రిలయన్స్ చెల్లిస్తోందన్నారు. కేజీ డీ-6లో ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని ముఖేష్ చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని కోల్ బెడ్ మిథేన్ బ్లాక్ లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆదాయపరంగా రిటైల్ రంగంలో రిలయన్స్ సంస్థ అగ్రగామిగా ఉందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News