: ఇంటర్నెట్ వ్యసనంగా మారిందా... ఇదిగో క్లినిక్!
కొందరికి ఇంటర్నెట్టే లోకం! గంటలు గంటలు సిస్టమ్ ముందు కూర్చుని దాన్నో వ్యసనంగా తలకెక్కించుకుంటారు. అలాంటి వారికి ఇంటర్నెట్ పిచ్చి వదిలించేందుకు దేశంలోనే తొలిసారిగా ఓ డీ-ఎడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఐటీ నగరంగా పేరొందిన బెంగళూరులో దీన్ని స్థాపించారు. నలుగురు మిత్రులు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. వారిలో డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, 'ప్రధానంగా 13-17 ఏజ్ గ్రూప్ లో ఉన్న బాలల్లో ఇంటర్నెట్ ఓ వ్యసనంగా మారింది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో ఇంటర్నెట్ ఓ వ్యసనంగా మారితే వ్యక్తులు స్వీయనియంత్రణ కోల్పోతారు' అని తెలిపారు.