: సంతోష్ కుమార్ కు నివాళులర్పించిన కేసీఆర్
కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల సంతోష్ కుమార్ (57) గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. హైదరాబాదులోని నాగోలు నివాసి అయిన సంతోష్ కుమార్ ఆకస్మిక మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సీఎం క్యాంపు ఆఫీస్ వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, టీ-లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.