: రుణమాఫీకి అడ్డంకి తొలగినట్లే... ఆర్బీఐ గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీకి ప్రధాన అడ్డంకి తొలగినట్లే! ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్బీఐ గవర్నర్ కు రుణమాఫీ ఆవశ్యకతను, రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితిని ఫోన్ లో వివరించారు. గత పదేళ్ళుగా రైతులు తీవ్రంగా నష్టపోయారని బాబు ఆయనకు చెప్పారు. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ రుణమాఫీ అంశంపై సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.