: ఫేస్ బుక్ ద్వారా స్నేహం ... ఆనక అత్యాచారం!


సోషల్ మీడియాలో ఏర్పడ్డ పరిచయం ఆమె (21) పాలిట శాపమైంది. చండీగఢ్ లో ఓ వివాహితతో ఫేస్ బుక్ లో స్నేహం చేసి, అత్యాచారం చేశాడో వంచకుడు. బాధిత యువతికి ఏడాదిక్రితం పెళ్ళయింది. కొంతకాలం కిందట ఆమెకు ఫేస్ బుక్ లో రాజ్ ఫౌజీ పరిచయమయ్యాడు. తర్వాత వారిద్దరూ తమ ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. ఓ రోజు రాజ్ ఆమెను సినిమా చూద్దాం రమ్మని ఆహ్వానించాడు.

మిత్రుడి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆమెను సినిమా థియేటర్ కు బదులు ఓ ఫాంహౌస్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు రాజ్. అంతేగాకుండా తన మిత్రులకు కూడా ఆమెను బలిచేశాడా కిరాతకుడు. జరిగిన దారుణాన్ని భర్తకు వివరించిందా అబల. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News