: యశ్వంత్ సిన్హాకు బెయిల్ మంజూరు
బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు బెయిల్ మంజూరైంది. జార్ఖండ్ లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన చేస్తూ యశ్వంత్ సిన్హా అరెస్ట్ అయిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ లోని హజారిబాగ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మంగళవారం నాడు బీజేపీ అగ్రనేత అద్వానీ జైలుకు వెళ్లి యస్వంత్ సిన్హాను కలసి మాట్లాడారు. ఇప్పుడిక బెయిల్ రావడంతో సిన్హా కారాగారం నుంచి బయటకు రానున్నారు.