: రుణమాఫీపై సందేహాలు వద్దు.. బాబు ప్రధానితో మాట్లాడారు: దేవినేని
రైతుల రుణమాఫీపై సందేహాలు అవసరం లేదని, కచ్చితంగా అమలుచేసి తీరతామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారని వెల్లడించారు.