: నెంబర్ టూ షారూఖ్ ఖాన్!


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు. ట్విట్టర్లో షారూఖ్ ఫాలోవర్ల సంఖ్య ఈ మధ్యాహ్నానికి 80 లక్షలు దాటింది. దీంతో ట్విట్టర్ ఫాలోవర్లలో షారూఖ్ రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. 90 లక్షల మంది పైచిలుకు ఫాలోవర్లతో ఆయన ట్విట్టర్లో నెంబర్ వన్ గా నిలిచారు. వారి తరువాతి స్థానాల్లో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ (7.18 లక్షలు) అమీర్ ఖాన్ (7.17 లక్షలు) ఉన్నారు. 2010లో ట్విట్టర్ ఖాతా తెరచిన షారూఖ్ తన సినిమాలు, ఐపీఎల్ క్రికెట్, వ్యక్తిగత జీవితం వంటి విషయాలను అభిమానులతో పంచుకుంటుంటాడు.

  • Loading...

More Telugu News