: దేవుడి ప్రసాదం...60 మందిని ఆసుపత్రి పాలు చేసింది
బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో దేవుడి ప్రసాదం 60 మంది భక్తులను ఆసుపత్రి పాలు చేసింది. ముజఫర్ పూర్ లోని ఓ గ్రామంలోని దేవాలయంలో దేవుడి ప్రసాదం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ప్రసాదం తినడంతో వీరికి వాంతులయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ముజఫర్ పూర్ లోని శ్రీ కృష్ణామెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.