: మీడియాపై ఖుష్బూ ఆగ్రహం


ప్రముఖ సినీ నటి ఖుష్బూ తమిళ వార్తా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరేందుకు ఖుష్బూ డీఎంకేకి గుడ్ బై చెప్పారంటూ వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఖుష్బూ ట్విట్టర్లో ఓ కామెంట్ పెట్టారు. తెల్ల కాగితాలను నింపేందుకు వార్తా పత్రికలు ఏదో ఒకటి రాయవద్దని ఆమె సూచించారు. ఖాళీ సమయాన్ని పూరించేందుకు ఏవో ఒక వార్తలు ప్రసారం చేయవద్దని ఆమె మీడియాను కోరారు. డీఎంకేకు రాజీనామా చేయడంతో ఆమె బీజేపీలో చేరుతున్నారంటూ తమిళనాట వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో ఆమె ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News