: ముషారఫ్ అరెస్టును తిరస్కరించిన పాక్ సుప్రీం
మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను అరెస్టు చేయాలన్న విజ్ఞప్తిని పాక్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2007 ఎమర్జెన్సీ సమయంలో ముషారఫ్ రాజద్రోహానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో విచారణ కోరుతూ ఐదు పిటిషన్ లు దాఖలయ్యాయి. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ముషారఫ్ దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఈరోజు కోర్టుకు హాజరుకావాలని చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆయన న్యాయవాది అహ్మద్ రజా కసౌరి కోర్టు ఎదుట హాజరై వాదనలు వినిపించారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లపై ముషారఫ్ తన స్పందనలను సమర్పించడానికి ఆరు వారాల సమయం కావాలని కోరారు. అయితే ఆరు రోజుల్లోగా స్పందనలను తెలియజేయాలని చెప్పిన ఇద్ధరు జడ్జిల ఆధ్వర్యంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదావేసింది.