: మీడియాపై ఆంక్షలు విధించడం మంచి పద్ధతి కాదు: మంత్రి పల్లె రఘునాథ్


టీవీ9, ఏబీఎస్ చానెళ్ల ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడాన్ని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తప్పుపట్టారు. మీడియాపై ఆంక్షలు విధించడం మంచి పద్ధతి కాదని సూచించారు. మీడియా చాలా పవర్ ఫుల్ అని... మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం రాజకీయ నేతలకు ఉందని అభిప్రాయపడ్డారు. అయితే జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వమే స్పందించాలని... తాము ఏమి మాట్లాడినా, వారు మరో విధంగా భావించే అవకాశం ఉందని అన్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా జరిగితే క్షమాపణతో ముగిసిపోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News