: 'చిరును కలిశానా.. వాట్ ఏ కామెడీ' అంటోన్న ఖుష్బూ!


రాజకీయాల్లోగానీ, సినిమా వ్యవహరాల్లోగానీ.. 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అంటారు. ఎవరు ఎవరిని కలిసినా సరికొత్త భాష్యం చెబుతుంటారు. ఒక్కోసారి ఏమీ జరగకపోయినా.. ఊహాగానాలతో హోరెత్తిస్తారు. ప్రముఖ దక్షిణాది నటి ఖుష్బూ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె ఇటీవల కేంద్ర మంత్రి చిరంజీవిని కలిసినట్టు వార్తలు రావడంతో కథనాలకు కాళ్ళొచ్చాయి. ఇంకేముంది, ఆ బొద్దుగుమ్మ కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనంటూ పలు పుకార్లు చెన్నై వీధుల్లో షికార్లు చేశాయి.

అయితే, ఈ సంగతి విని ఖుష్బూ ఏమంటున్నారో వినండి. తొలుత ఆగ్రహం వ్యక్తం చేసినా.. కాసేపటి తర్వాత నవ్వుతూ 'వాటే కామెడీ.. నేను చిరంజీవిని కలవడమేంటి, కాంగ్రెస్ లో చేరడం ఏంటి'!? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఈ ఊహాగానాలన్నింటికీ కారణం.. ఆమె ఇటీవల డీఎంకే వారసత్వ రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేయడమే. స్టాలిన్ పై వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే కార్యకర్తలు ఆమె నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే 'మెగాస్టార్ తో భేటీ(?)' అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఖండించిన ఖుష్బూ.. తాను ఎప్పటికీ డీఎంకేలోనే కొనసాగుతానని, పార్టీ మారేది లేదని కరాఖండీగా చెప్పేసింది.

  • Loading...

More Telugu News