: ఇరాక్ సంక్షోభంపై సుష్మాస్వరాజ్ సమీక్ష
ఇరాక్ సంక్షోభంపై భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇరాక్ లోని బాగ్దాద్ లో ఉన్న విదేశాంగ శాఖ కార్యాలయ ఉన్నతాధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాక్ లో ఉన్న భారతీయులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు. విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు భారతీయులకు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించక ముందే ఇరాక్ నుంచి తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
తక్షణం భారతీయులంతా వెనుకకు రావాలని సూచించారు. రాయబార కార్యాలయం అధికారులు సుష్మాస్వరాజ్ కు తిక్రిత్ లో చిక్కుకున్న 44 మంది కేరళ నర్సులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. వారు గత వారం రోజులుగా అక్కడ చిక్కుకున్నారు. కాగా బాగ్దాద్ లోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటల సేవా కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే.