: మీడియా ఊహాగానాలపై స్పందించను: షీలా దీక్షిత్


మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందించనని కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తెలిపారు. తిరువనంతపురంలో ఆమె మాట్లాడుతూ, ఊహాగాన వార్తలపై స్పందించేందుకు ఏమీ లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు అందితే అప్పుడు దానిపై స్పందిస్తామని అన్నారు. యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం భావిస్తున్నట్టు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. దీంతో ఇప్పటికే ముగ్గురు గవర్నర్ లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News