: మండే ఎండలతో నిప్పుల కుంపటిగా మారిన రాష్ట్రం


ఈ వేసవిలో ఎండలు మండుతుండటంతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. జూన్ నెల ద్వితీయార్థంలోనూ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఓ వైపు వడగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలను, మరోవైపు వేళాపాళా లేని కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండ తీవ్రత తగ్గలేదు. ఈ రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడానికి మరో 3 రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. పగటి పూట ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సముద్రతీర ప్రాంతంలో ఉక్కపోతతో ప్రజలు విల్లవిల్లాడుతున్నారు. కోస్తాంధ్రలో 4 నుంచి 7, సీమలో 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తునిలో అత్యధికంగా 44 డిగ్రీలు, రెంటచింతలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడ, బందరు, ఒంగోలు, బాపట్లలో 42 డిగ్రీలు, విశాఖ, నెల్లూరు, నర్సాపురం, కావలిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. తిరుపతి, నందిగామ, కళింగపట్నంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News