: బోనాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాదులో బోనాల పండుగ ఏర్పాట్లను తెలంగాణ డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రి పద్మారావు పరిశీలించారు. పాతబస్తీలోని లాల్ దర్వాజా, మహంకాళీ ఆలయాల వద్ద పరిశీలన జరిపారు. ఆలయ అధికారులు, పోలీసు అధికారులు, స్థానిక నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.