: కోతి చేష్టతో నిలిచిన దురంతో, గరీబ్ రథ్, పాట్నా ఎక్స్ ప్రెస్ రైళ్లు


కోతి చేష్టకు పలు రైళ్లు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు రైల్వే స్టేషన్ లూప్ లైన్ లో విజయవాడ నుంచి వరంగల్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం నిలిపారు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన కోతి గూడ్స్ వ్యాగన్ (72982) పైకి ఎక్కి ఎగురుతూ విద్యుత్ కాంటాక్టు వైరును పట్టుకుంది. దానినుంచి విద్యుత్ ప్రవాహం జరుగుతుండడంతో మంటలు లేచి వైరు తెగిపడింది.

దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కాజీపేట రైల్వే లోకో షెడ్ ఇంజనీరింగ్ అధికారులు, నెక్కొండ నుంచి రైల్వే ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ తీగలను తాత్కాలికంగా జాయింట్ చేశారు. దీంతో దర్భంగా, దురంతో, గరీబ్ రథ్, పాట్నా ఎక్స్ ప్రెస్, పలు గూడ్స్ రైళ్లు మళ్లీ పరుగులు తీశాయి.

  • Loading...

More Telugu News