: విజయవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇవాళ విజయవాడ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సౌకర్యాల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వాసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు సరిగా అందడం లేదంటూ రోగులు మంత్రికి విన్నవించడంతో ఆయన డాక్టర్లపై మండిపడ్డారు. వైద్యసేవలు సకాలంలో అందించాలని, అందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ఆయన డాక్టర్లతో చెప్పారు.