: అరగంటలో ఆన్ లైన్ టిక్కెట్లన్నీ హాంఫట్!
దాయాదులు భారత్, పాకిస్తాన్ ల మధ్య స్పర్ధ ఎక్కడైనా రసవత్తరమే. సరిహద్దుల్లో కానివ్వండి, క్రీడా మైదానాల్లో కానివ్వండి.. ఆ పోరు ప్రత్యేకం. క్రికెట్, హాకీ.. ఇలా క్రీడ ఏదైనా అభిమానులకు మస్త్ మజా అందించడం ఖాయం. అందుకే ఫ్యాన్స్ భారత్, పాక్ మ్యాచ్ లంటే పడిచస్తారు. క్రికెట్ మ్యాచ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. త్వరలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఆ టోర్నీలో భారత్-పాక్ పోరుకు టిక్కెట్లు రికార్డు వ్యవధిలో అమ్ముడయ్యాయట. జూన్ 15న జరిగే దాయాదుల మ్యాచ్ కోసమని ఈరోజు ఆన్ లైన్ లో టిక్కెట్లు విడుదల చేసిన 30 నిమిషాల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. కాగా, ఈ పరిమిత ఓవర్ల టోర్నీ జూన్ 6 న ఇంగ్లండ్ లో మొదలవనుంది. ఈ భారీ ఈవెంట్ లో టెస్టు క్రికెట్ ఆడే ఎనిమిది దేశాలు పాల్గొంటాయి.