: ఏపీ అసెంబ్లీలో విజటర్స్ కు ప్రవేశం లేదు!
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశ మందిరం చాలా చిన్నదని, అందువల్ల విజిటర్స్ ను అనుమతించడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విజిటర్స్ పాస్ లు కోరవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే సూచించామని అన్నారు. మీడియా గ్యాలరీ కూడా చిన్నది కావడంతో అన్ని సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులను అనుమతించలేకపోతున్నామని ఆయన చెప్పారు.
ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీకి కొత్త మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడు అందరికీ అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గేట్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని యనమల తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.