: ఉపాధ్యాయుల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: టి.విద్యాశాఖ మంత్రి
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ చదువుకునే విధంగా వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సీమాంధ్రుల పాలనలో విద్యారంగం మొత్తం అస్తవ్యస్తంగా తయారయిందని ఆరోపించారు.