: చాక్లెట్ ఆశచూపి అత్యాచారం
ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపాడు. ఇష్టమైన చాక్లెట్ ఇస్తాననే సరికి ఆ బాలిక అతడితో వెళ్లింది. దాంతో ఆ మృగాడు బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లా పిప్లా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు తుషార్ మిస్కిన్(24)ను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. అలాగే, మరో కేసులో పెళ్లి చేసుకుంటానని 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సమిత్ సతిబాబ్నే(26)ను కూడా నాగ్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.