: టీఆర్ఎస్ పార్టీవి తాటాకు చప్పుళ్లు... బెదిరేది లేదు: రమణ
టీఆర్ఎస్ పార్టీవి తాటాకు చప్పుళ్లని... అలాంటి వాటికి తాము బెదిరేది లేదని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. టీడీపీపై విమర్శలను టీఆర్ఎస్ నాయకులు మానుకుంటే బాగుంటుందని సూచించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాదులో శాంతిభద్రతలు నెలకొన్నాయని... అంతకు ముందు మతకల్లోలాలతో నగరం అట్టుడికేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉండటానికి కారణం తెలుగుదేశం పార్టీయే అని చెప్పారు.