: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్
తెలుగుదేశం కార్యకర్తల కోసం ఏర్పాటుచేసే సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. కార్యకర్తల సంక్షేమంపై నేతలను సంప్రదించి విధివిధానాలను రూపొందించాలని లోకేష్ ను బాబు ఆదేశించారు. పార్టీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే హైదరాబాదు గండిపేటలో రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించింది. అప్పుడే ఈ సంక్షేమ నిధి కార్యక్రమాన్ని లోకేష్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.