: ఆ విమానం ఆచూకీ తెలిసే వరకు విశ్రమించం: మలేసియా ప్రధాని


మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరి, మార్గ మధ్యంలో అదృశ్యమైన విమానం ఆచూకీ తెలుసుకునేంత వరకు విశ్రమించేది లేదని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విమానం అదృశ్యమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విమానం ఏమైందో తెలియడం లేదని పేర్కొన్న ఆయన, విమానం ఆచూకీ లభించకపోవడంతో అందులోని ప్రయాణికుల బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మలేసియా ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని పేర్కొన్నారు.

మలేసియా విమాన ప్రమాదంపై పూర్తి వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారని, ఆందోళన చేస్తే చెప్పిన వివరాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ప్రయాణికుల బంధువులు ఆరోపిస్తున్నారు. మార్చి 8న 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన విమానం ఉన్నపళంగా మాయమైంది. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో ఏడు దేశాలు సంయుక్తంగా గాలిస్తున్నా, విమానం ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

  • Loading...

More Telugu News