: సింగపూర్ సహకారంతో ఏపీ రాజధాని నిర్మాణం: నారాయణ


సింగపూర్ వంటి రాజధానిని నిర్మిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ రోజు ప్రభుత్వ అధికారులతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ... నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని అన్ని వసతులు ఉండేలా నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు.

  • Loading...

More Telugu News