: బ్యాంకులు వద్దంటున్నాయని రుణమాఫీ అమలు చేయకుండా ఉండలేం: యనమల
ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీకి తాము అనుకూలంగా లేమంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. బ్యాంకులు వద్దంటున్నాయని రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఉండలేమన్నారు. అసలు రైతు రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరం లేదన్నారు. బ్యాంకులు ఎప్పుడూ రుణమాఫీకి అనుకూలంగా ఉండవని ఆయన చెప్పారు. కాగా, స్థలాభావం వల్ల ఈ అసెంబ్లీ సమావేశాలకు సందర్శకులకు అనుమతి లేదని... శాంతి, భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.