: ఈ నెల 25న భారత మర్కెట్లోకి గెలాక్సీ ఎస్4


ఎంతో మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మొబైల్ ఈ నెల 25న భారతీయ మార్కెట్లో విడుదల అవుతుందని సమాచారం. ఈ నెల 27నుంచి ఇది స్టోర్లలో లభ్యం కానుంది. ఫోన్ గరిష్ఠ చిల్లర విక్రయ ధర 42000గా ఉంటుందని, 40వేల లోపు ధరకే లభ్యం అవుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. యాపిల్ ఐఫోన్5కు మించిన అత్యాధునిక ఫీచర్లతో ఎస్4ను రెండు వారాల క్రితం శాంసంగ్ అమెరికా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్క్రీన్ ను తాకకుండానే ఫోన్ లో అప్లికేషన్లను తెరవడం, మూయడం, వీడియోలను సైగల ద్వారానే ఆన్, ఆఫ్ చేయడం ఇలా ఎన్నో కళ్లు చెదిరే ఫీచర్లు దీని సొంతం. దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News