: సంగారెడ్డిలో హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డిల పర్యటన
మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఇవాళ ఉదయం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఫతేఖాన్ దర్గాను సందర్శించారు. తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.