: కాంగ్రెస్ సీనియర్లపై ఆనం ధ్వజం
కాంగ్రెస్ సీనియర్లపై ఆనం వివేకానందరెడ్డి విరుచుకుపడ్డారు. విజయవాడలోని కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తకుండా దేశం కోసం రాహుల్ సేవ చేస్తుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సీనియర్లంతా పెద్దలయ్యారని మండిపడ్డారు. అధిష్ఠానం ప్రాపకం కోసం డిగ్గీరాజా అసంబద్ధమైన నివేదికలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు నోరుతిరగని నేతలంతా విభజనకు బాధ్యులయ్యారని ఆయన విమర్శించారు.
ఇక్కడి పద్ధతులు, సంప్రదాయాలు, అవసరాలపై అవగాహనలేని వారంతా రాష్ట్రాన్ని విభజించి తప్పుచేశారని అన్నారు. మీడియాతో ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టారని ఆయన చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు ఎన్నికల్లో సరిగ్గా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.