: పెరగనున్న రైల్వే చార్జీలు?


రైల్వే చార్జీలకు రెక్కలు రానున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైల్వే శాఖ ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచాలని భావిస్తోంది. అయితే, ఎప్పటి నుంచి పెంచేది సమాచారం లేదు. బడ్జెట్ వచ్చే నెలలో ఉండగా, ఆ లోపే పెరుగుదల ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 16న రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటికి కొత్త ప్రభుత్వం కొలువు దీరలేదు కనుక, నాటి రైల్వే మంత్రి ఖర్గే ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. మార్కెట్లో పెరిగే ఇంధన ధరలకు అనుగుణంగా సర్దుబాటు పేరిట రైల్వే శాఖ చార్జీలను ఎప్పుడైనా పెంచడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 30 కోట్ల రూపాయల నష్టాన్ని రైల్వే శాఖ ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News