: బీజేపీ వైపు కిరణ్ కుమార్ రెడ్డి చూపు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి రాజకీయంగా తెరపైకి రావాలనుకుంటున్నట్లు సమాచారం. బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో సీఎం పదవికి, కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి గుడ్ బై చెప్పడంతో పాటు ఎన్నికల ముందు 'జై సమైక్యాంధ్రప్రదేశ్' పార్టీని పెట్టి తాను పోటీ చేయకుండా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్కరూ గెలవలేదు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరడం అసాధ్యమని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నారని, చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయంగా భవిష్యత్తు కోసం బీజేపీలో చేరడమే మంచిదని ఆయనకు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం.