: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామా చేయాల్సిందే: బీజేపీ
యూపీఏ పదేళ్ల పాలనకు చరమ గీతం పాడి గద్దెనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం పలు రాజ్యాంగ పదవుల్లో తమ పార్టీ సీనియర్ నేతలను నియమించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో కేరళ, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ సహా ఆరు రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమితులైన వారు తక్షణం పదవుల నుంచి వైదొలగాలని బీజేపీ ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, ప్రతిభ ఆధారంగా కాకుండా సోనియాగాంధీ చేత నియమితులైన గవర్నర్లు తమకు తాముగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.