: గవర్నర్లపై పడనున్న వేటు
రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై నరేంద్రమోడీ సర్కారు దృష్టి పెట్టనుంది. యూపీఏ-2 హయాంలో నియమితులైన గవర్నర్లను ప్రభుత్వం తొలగించవచ్చని సమాచారం. కేరళ (షీలా దీక్షిత్), ఉత్తరప్రదేశ్ (బీఎల్ జోషి), మధ్యప్రదేశ్ (రామ్ నరేశ్ యాదవ్), పశ్చిమబెంగాల్ (ఎంకే నారాయణన్), పంజాబ్ (శివరాజ్ పాటిల్) గవర్నర్లను తప్పించనున్నట్లు తెలుస్తోంది. వీరి రాజీనామాలను కోరాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర సర్కారు కోరనుందని సమాచారం.