: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ ప్రణాళికపై లోతుగా చర్చించనున్నారు. పార్టీ సీనియర్ నేతలు కేవీపీ, జేడీ శీలం, బొత్స, కిల్లి కృపారాణి, సి.రామచంద్రయ్య, రఘువీరారెడ్డి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కాగా, యూరప్ పర్యటనలో ఉన్న కారణంగా చిరంజీవి సమావేశానికి రాలేకపోయారు.