: గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలపై ఉక్కుపాదం మోపుతాం: చినరాజప్ప


గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప హెచ్చరించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో అరాచక శక్తులు ప్రభుత్వ భూములను, అమాయకుల భూములను కొల్లగొట్టాయని... వీటన్నింటినీ తాము తిరగదోడతామని చెప్పారు. వీటి వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెరిట్, కౌన్సిలింగ్ ఆధారంగానే పోలీస్ డిపార్ట్ మెంట్ లో బదిలీలు ఉంటాయని చెప్పారు.

  • Loading...

More Telugu News