: రుణాల మాఫీపై రిజర్వ్ బ్యాంకు మెలిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణాల మాఫీకి తాము సుముఖం కాదని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. సక్రమంగా రుణాలు చెల్లించేవారిని నిరుత్సాహపరచినట్లు అవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖకు రిజర్వ్ బ్యాంకు బదులిచ్చింది. సెక్యూరిటీల రూపంలో కాకుండా నగదు రూపంలో రుణాల మాఫీకి సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ లేఖ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నెల 25న ఢిల్లీ వెళ్లి రిజర్వ్ బ్యాంకు అధికారులతో చర్చలు జరపనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలవనున్నారు.