: ఈ నెల 19న తొలిసారిగా సచివాలయానికి చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం సచివాలయానికి వస్తున్నారు. ఆయన ఆ రోజున ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకు ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో అడుగిడనున్నారు. సచివాలయంలో ఆయన కోసం ఎల్ బ్లాకులోని 8వ అంతస్తును కేటాయించినప్పటికీ, అక్కడ మరమ్మత్తు పనులు ఇంకా పూర్తికాకపోవడంతో తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచే బాబు కార్యకలాపాలను కొనసాగిస్తారు.