: ప్రేమ పేరిట వల వేసి...మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి...నీలి చిత్రాలు తీస్తాడు!
ప్రేమ పేరిట యువతులను వలలో వేసుకుని...పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన తరువాత... వారిని రూంకు తీసుకువెళ్లి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి, వారితో నీలి చిత్రాలు తీసే మోసగాడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... చెన్నైలో ఈ మాయగాడు పలువురు యువతులను ప్రేమ పేరుతో ఒకరి తరువాత మరొకరిని వలలో వేసుకుంటాడు. వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిన తరువాత ఏదో ఒక కారణం చెప్పి వారిని రూముకు తీసుకెళ్తాడు.
అక్కడ వారికి మత్తు మందు ఇచ్చి వారిని మైకంలోకి జారుకునేలా చేస్తాడు. ఆ తరువాత వారిని వివస్త్రలను చేసి నీలి చిత్రాలు తీస్తాడు. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేసి వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తాడు. అలా చాలా మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. చెన్నై పోలీసులు దిండుగల్ సమీపంలో ఈ ఘరానా మోసగాడ్ని అరెస్టు చేశారు.