: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మంగళగిరి మండలంలోని చినకాకానిలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.